Type Here to Get Search Results !

బీరకాయతొక్కు పచ్చడి - Beerakaya thokku pachadi

 బీరకాయతొక్కు పచ్చడి:

కావలసిన వస్తువులు:

బీరకాయలనుండి తరిగేసిన చెక్కులు - అరకేజీ

ఆయిల్ - 25గ్రా||

చింతపండు - రెండు రెప్పలు

ఉప్పు - సరిపడినంత

ఎండుమిర్చీ - 6

ఇంగువ ముక్క - చిన్నది


తయారు చేసే విధానం:

ముందుగా ఎండుమిర్చీ ఇంగువ ముక్క వేయించి పెట్టుకోవాలి. బీరపొట్టు శుభ్రంగా కడిగెయ్యాలి. ఆయిలు మరిగించి బీరపొట్టును అందులో వేసి దాని మధ్యలో చింత పండును ఉంచి కొంచెం నీళ్ళుచల్లి మూతపెట్టాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి చెక్కు బాగ మెత్తబడిన తరువాత ఆ చెక్కు చింతపండు మిశ్రమాన్ని వేయించిపెట్టిన ఎండుమిర్చీ ఏకంచేసి సరిపడా ఉప్పు వేసి రోట్లోవేసి దంచేయాలి.




Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom