దోసకాయ పప్పు:
కావలసిన వస్తువులు:
దోసకాయలు - పావు కిలో
కందిపప్పు - 250 గ్రా
నూనె - 25 గ్రా
చింతపండు - సరిపడినంత
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - 1/4 కట్ట
పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 1.
ఇంగువ - చిటికెడు
పోపు గింజలు - తగినన్ని
ఉప్పు - సరిపడినంత
కారం - అర టీ స్పూన్
ఉల్లిపాయలు - 2
తయారు చేసే విధానం:
చింతపండు నానేయాలి. దోసకాయ చెక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. కందిపప్పును ఉడికించి దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో కుమ్మరించాలి. ముక్క ఉడికాక చింతపండు పులుసు నందులో పిండి కొత్తిమీర ఉప్పు వేసి, పప్పు బాగా ముద్దయ్యేదాకా మగ్గనివ్వాలి ఈలోగా మరో స్టవ్‌మీదనో, బర్నర్ మీదనో పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువా, ఎండుమిర్చీ ముక్కల్ని బాగా వేయించి పోపుని పప్పులోకి వంపి కలుపుకుని దింపుకోవాలి.