Type Here to Get Search Results !

సోపుగింజల టీ - Fennel tea

 సోపుగింజల టీ :

సోపుగింజల టీ జీర్ణ ప్రక్రియకు బాగా దోహదపడుతుంది. మాంసాహారం మరియు భారీగా భోజనం చేసిన తరువాత ఈ టీని తాగారు అనుకోండి తేలికగా జీర్ణం అవుతుంది. మరియు టాక్సిన్స్ కూడా మాయమవుతాయి . దీనిని ఎలా తయారు చేయాలో చూద్దామా ?


కావలసిన పదార్ధాలు :

నీరు - 2 కప్పులు ,

సోపు గింజలు -1 స్పూన్.


తయారుచేయు విధానం :

ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసి బాగా మరిగించాలి. తర్వాత సోపుని వేసి ఒక నిమిషం మరిగించాలి. ఇక టీ గ్లాస్ లో పోసి తాగేయడమే.


గమనిక:

మీరు మరిగించిన సోపు గింజల్నిపారేయకుండా ఇంకోసారి నీళ్లు పోసి మరిగించి టీ తయారు చేసుకోవచ్చు.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom