బంగాళదుంప వేపుడు:
కావలసిన వస్తువులు:
బంగాళదుంపలు - 4
కారం - తగినంత
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారు చేసే విధానం:
బంగాళదుంపలు పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత నీటిలో కడగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక బంగాళదుంపల ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. కారం కాక పోయినా అందులో పప్పుల పొడుము కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.