బంగాళదుంప కుర్మా:
కావలసిన వస్తువులు:
బంగాళాదుంప - 2
క్యారెట్ - 2
ఉల్లిపాయ - 1
టమోటా - 1
పెరుగు - 1 కప్పు
నూనె - 14 టీ స్పూనులు
ధనియాలు - 4 టీ స్పూనులు
గసగసాలు - 1 టీస్పూను
కొబ్బరి - 1/4 చిప్ప
పట్ట - చిన్న ముక్క
లవంగాలు - 7
అల్లం పేస్ట్ - 2 టీ స్పూనులు
వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూనులు
తయారు చేసే విధానం:
మసాల గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప విడిగా ఉడకబెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, టమోటా వేయించాలి. ఇవి వేగాక మసాల, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి[10 లేదా 15 నిముషాలు]. ఇది ఉడికాక బంగాళదుంప, క్యారెట్ వేసి 2 నిముషాలు ఉంచాలి. దించబోయే ముందు పెరుగు వేసి కలపాలి.