టమోటా పప్పు:
కావలసిన వస్తువులు:
టమోటాలు - పావు కిలో
కందిపప్పు - 250 గ్రా
నూనె - 25 గ్రా
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 రెబ్బలు
వెల్లుల్లి - 1 రేక
చింతపండు - సరిపడినంత
ఉప్పు - సరిపడినంత
కారం - అర టీ స్పూన్
పసుపు - 1 చిటికెడు
పోపులు - సరిపడినంత
ఉల్లిపాయలు - 2.
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - కొంచెం.
ఎండుమిర్చి - 1
తయారు చేసే విధానం:
కందిపప్పు బాగా కడిగి ఉడక బెట్టాలి, సగానికి పైగా ఉడికిన తరువాత, టమోటా ముక్కలు, ఉల్లిపాయలు కోసి వెయ్యాలి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు పోసి ఉల్లిపాయ ఉడికేంతవరకు ఉంచి, అనంతరం బాండిలో నూనె కాచి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ,ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి.