బంగాళాదుంప పులుసు:
కావలసిన వస్తువులు:
బంగాళాదుపలు - అరకిలో (ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేయాలి)
ఉల్లిపాయలు - 2 (పేస్ట్ చేసుకోవాలి)
టొమాటో - 2 (పేస్ట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 1 (నిలువుగా కట్ చేసుకోవాలి)
పసుపు - పావు టీ స్పూన్
కారం - తగినంత
ఉప్పు - తగినంత
ధనియాల పొడి - 1 టీ స్పూన్
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
చింతపండు - నిమ్మకాయ సైజు (నానబెట్టి రసం తీసుకోవాలి)
నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
ఎండుమిర్చి - రెండు
వెల్లుల్లి రేకులు - 4 (కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి)
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - తగినంత
తయారు చేసే విధానం:
పాత్రలో నూనె వేడయ్యాక, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్‌ని పోపులో వేసి గోధుమ రంగు వచేవరకు వేయించుకున్నాక, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. టొమాటో పేస్ట్‌ని దీంట్లో కలిపి అయిదు నిమిషాలు వేయించాలి. ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని, ఉప్పుని జత చేసి మరో అయిదు నిమిషాలపాటు వేగనివ్వాలి. చింతపండు రసంతోపాటు మరో కప్పు నీటిని జతచేసి, కలియబెట్టి పది నిమిషాలపాటు ఉడకనిచ్చి దించేయాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంలోకి గాని, చపాతీలోకి గాని వడ్డించాలి.