పప్పు - బీట్రూట్ ఫ్రై:
కావలసిన వస్తువులు:
బీట్రూట్ - 2 మీడియం సైజ్వి (చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కందిపప్పు/ - 1 కప్పు (ఉడకబెట్టాలి)
పచ్చిమిచ్చి - 3 నిలువుగా కట్ చేసుకోవాలి)
ఎండుమిర్చి - 3 (మధ్యలొకి విరిచి గింజలు తీసేయాలి)
పసుపు - చిటికెడు
కరివేపాకు - 2 రెబ్బలు
ఆవాలు - అర టీ స్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
నూనె - 2 టీ స్పూన్స్
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. పచ్చిమిర్చి, బీట్రూట్, పసుపు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి కలిపి, మూత పెట్టి సన్నని మంటపై 15 నిమిషాలుంచాలి. బీట్రూట్ కొద్దిగా మెత్త బడగానే కందిపప్పుని జత చేసి కలిపి మరో 5 నిమిషాలుంచి దించేయాలి వేడివేడిగా అన్నంలోకి వడ్డించాలి.