పప్పు పులుసు:
కావలసిన వస్తువులు:
కందిపప్పు - 100గ్రా
చింతపండు - నిమ్మకాయంత
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 6
ఉల్లిపాయలు - 250గ్రా
కర్వేపాకు, కొత్తిమీర - కొంచెం
ఉప్పు, కారం - తగినంత
తయారు చేసే విధానం:
చింతపండునానేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగాను, పచ్చిమిర్చి సన్నంగాను తరుక్కోవాలి. ఎండుమిర్చి ముక్కలుగాను తుంపుకోవాలి. ముందుగా పప్పు ఉడకేసి బాగా ఎనిమి ఉల్లి, మిర్చిముక్కలు, కర్వేపాకులు, కొత్తిమీర, ఉప్పు, కారం, చింతపండు పులుసుపోసి కాసిని నీళ్ళు కూడపోసి మొత్తం 1 లీటరు ద్రవం చేసి మరిగించాలి. ఆ పులుసు పొంగుతున్నప్పుడు పోపులో ఇంగువ వేసుకుంటే పులుసు ఘుమఘుమ లాడి పోతుంది.