పెసరపప్పు - నిమ్మకాయ కూర:
కావలసిన వస్తువులు:
పెసరపప్పు - పావు కిలో
ఉల్లిపాయ - పెద్దది ఒకటి
పచ్చిమిర్చి - రెండు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఎండు మిర్చి - 4
ఆవాలు - 1/2 టీ స్పూన్.
మినపప్పు - 1 టీ స్పూన్
జీలకర్ర - 1/4 టీ స్పూన్
వెల్లుల్లి - 3 రేకలు
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
నూనె - తగినంత
నిమ్మకాయ - పెద్దది ఒకటి
తయారు చేసే విధానం:
పెసర పప్పును మొదట దోరగా వేయించాలి. తగినంత నీరు పోసి ఉడికించాలి. రెండు పొంగులు వచ్చాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు వేసి మెత్తగా ఉడికించి, ఉప్పు వేసి దించి మెత్తగా మెదిపి, బాణలిలో నూనె మరిగాక పైన చెప్పిన పోపు వేయించి పప్పులో కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. చివరిగా నిమ్మరం పిండి పప్పులో కలియబెట్టాలి.ఈ పప్పు కూరను గట్టిగా కాకుండా లూజుగా చేసుకోవడం బాగుంటుంది.