Type Here to Get Search Results !

గోధుమ పుట్నాల పాయసం -

 గోధుమ పుట్నాల పాయసం

ఇంతకు ముందు గోధుమ బిస్కట్లు తయారు చేయడం చూసారు కదా. వాటితో పిల్లలకి మంచి బలవర్ధకరమైన పాయసం చెయడం చుద్దాం.

కావలసినవి:

కాచిన పాలు ఒక గ్లాసు

పుట్నాలు ఒక కప్పు

పంచదార అర కప్పు

తురిమిన పచ్చి కొబ్బరి పావు కప్పు

గోధుమ బిస్కట్లు గుప్పెడు

విధానం:

పుట్నాలు, పంచదార, పచ్చి కొబ్బరి తురుము మూడింటిని కలిపి మిక్సీ లో వేసి పొడి చేసుకొండి. ఒక వెడల్పాటి గిన్నెలో మరిగిన పాలు తీసుకుని, ఈ పొడిని వేసి బాగ కలిపి మూడు నిముషాలు పొయ్యి మీద పెట్టి వుడికించండి. ఇష్టమున్న వాళ్ళు ఒక చెంచా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వెసుకోవచ్చు కూడా. ఇప్పుదు ఈ మిశ్రమాన్ని చల్లార్చి గోధుమ బిస్కట్లు వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టండి. చల్లరాక సెర్వ్ చెయ్యండి.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom