Type Here to Get Search Results !

బ్రెడ్ బజ్జీ - Bread buzzy

 బ్రెడ్ బజ్జీ:

కావలసిన పదార్థాలు :

బ్రెడ్ స్లయిస్‌లు - నాలుగు,

శెనగపిండి - ఒక కప్పు,

జీలకర్ర - ఒక టీ స్పూన్,

కారం - అర టీస్పూన్,

నూనె - వేగించడానికి సరిపడా,

ఉప్పు - రుచికి సరిపడా,

వంటసోడా - చిటికెడు.


తయారుచేసే పద్ధతి :

ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి.

తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ వేడి వేడి బ్రెడ్ బజ్జీలను సాస్ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom