Type Here to Get Search Results !

చపాతీలు - Chapatis - Roti

 చపాతీలు-

చపాతీలు చేయడం కష్టమని కొంతమంది అభిప్రాయం. అందుకె బయట నుండి కొనుక్కుంటూ ఉంటారు లెదా కేవలం సమయం ఉన్నప్పుడే చెసుకుంటారు. కొంచెం అలవాటు ఐతే చేస్కోవడం పెద్ద శ్రమ అనిపించదు.

కావలసినవి:

గోధుమపిండి రెండు కప్పులు

నీరు ఒక గ్లాసు

విధానం:

కలపటానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నెలొ పిండి వేసుకోవాలి. కొద్ది కొద్ది గా నీరు పోసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. కొత్తగా చేసేవారు కొంచెం కొంచెం నీరు పోస్కొవడం ఉత్తమం. లేదంటె గుజ్జు అయిపొవచ్చు. కొచెం గట్టిగా నె కలిపి చేత్తొ బాగా ముద్దలా చెయ్యాలి. ఈ ముద్దని ఒక గంట పక్కన పెత్తి పైన ఒక మూత లేదా తడి బట్ట కప్పి ఉంచితే ఎండిపోకుండా ఉంటుంది.

తర్వాత పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన ఉంచుకొవాలి. చపాతి పీటపై కొంచెం గొధుమపిండి జల్లి ఒక ముద్దని తీసుకుని చపాతి కర్రతో గుండ్రంగా వొత్తుకొవాలి. అత్తుక్కుంటోంది అనిపిన్స్తే కొంచెం గొధుమ పిండి జల్లుకోండి. ఇలా కొంచెం వొత్తి మళ్ళీ దాన్ని మరో వైపు తిప్పి వొత్తుకొవాలి. ఇలా మనకు కవలసినంత పల్చగా వొత్తుకొవాలి.మరీ పల్చగా ఐతే చినిగిపొతాయి.

పొయ్యి వెలిగించి పెనం పెట్టి, పెనం వేడి అయ్యాక, చపాతి వేసుకొని కల్చాలి. లోపలి గాలి వేడి అయ్యి చపాతి కొంచెం పొంగుతుంది అప్పుడు మరొ వైపుకి తిప్పి కాల్చుకొవాలి. అల రెండు వైపులా కాల్చుకొని యెదైన కూర లేదా పప్పు తో తినవచ్చు.

నూనెలేకుండా చేసిన వాటినె పుల్కాలు అంటారు. నూనె వేస్తే చపాతినే!

సూచన:

1. కొంత మంది పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసుకుంటారు. కావాలంటె వేసుకొవచ్చు.

2. పిండి కలిపేటప్పుడు అర కప్పు గోరువెచ్చని పాలు పోస్తె మెత్తగ వస్తాయి. అప్పుడు ఆ వారా నీరు తగ్గించండి.

3. కావలనుకునే వారు నూనె లెదా నెయ్యి వెసి కాల్చుకొవచ్చు. ఆలివ్ లేదా సంఫ్లవర్ నూనె బావుంటాయి.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom