సెనగల శాతాలింపు.
పండగల సమయంలో, దేవుని నైవెద్యానికి త్వరగా అయిపొయే మంచి బలవర్ధకరమైన వంట ఇది.
కావలసినవి:
సెనగలు: 2 కప్పులు
తాలింపుకి: జీలకర్ర అర చెంచా, కరివేపాకు ఒక రెమ్మ , రెండు ఎండుమిర్చి, స్పూను నూనె, ఉప్పు కొంచెం
విధానం:
సెనగలు ముందు రోజు మధ్యహ్నం నానబెట్టండి. పడుకోబోయె ముందు నీళ్ళు వంపెయండి. కాటన్ గుడ్డలో లేదా ఒక చిల్లుల గిన్నెలో పెట్టి మూత పెట్టండి. గాలి ఆడేటట్లు వుండాలి.
మరునాటికి మొలకలు వస్తాయి. కుక్కర్లో కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీరు పోసి సెనగలువేసి ఒక విజిల్ వచ్చె వరకు వుంచండి. కుక్కర్ చల్లారాక నీరు వంపేసి పక్కన ఉంచండి.
బానలిలో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టమైతె ఇంగువ వేసి వేపాక వుడికిన సెనగలు వేసి , ఉప్పు వేసి బాగ కలిపి చిన్న మంట పై రెండు నిముషాలు మూత పెట్టి వుంచండి. తర్వాత పొయ్యి కట్టేసి గిన్నెలోకి తీసుకోండి.