చారు పొడి.
చలి కాలంలో చాలా మందికి చారు/రసం పెట్టడం అలవాటు.జలుబు దగ్గు అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలకు చారు మంచి చిట్కా. ఐతే చారు పొడి ఇంట్లోనే చేసుకొవచ్చు. దీనికోసం చాల విధాలున్నాయి. నా విధానం ఇక్కడ ఇచ్చాను.
కావల్సినవి:
ధనియాలు ఒక కప్పు
మిరియాలు ఒక స్పూను
జీలకర్ర ఒక స్పూను
యెండు మిరపకాయలు 6-8
వెల్లుల్లి 10 పాయలు
కరివేపాకు 2 రెమ్మలు
ఇంగువ రెండు చిటికెళ్ళు
మినపప్పు ఒక స్పూను
విధానం:
యెండు మిరపకాయలు మినహా మిగతా అన్నింటినీ విడి విడి గా నూనె లేకుండా వేయించుకొవాలి. అర చెంచా నూనెలో యెండుమిరపకాయలు వేసి వేయించాలి. అన్నింటినీ చల్లార్చి ఇంగువ కూడా వేసి మిక్సీ పట్టి గాజు సీసా లో పోసుకుంటే ఘుమఘుమలాడుతూ నెల్నాళ్ళు ఉంటుంది.