తోటకూర పప్పు:
కావలసిన వస్తువులు:
తోటకూర - 1 కట్ట
కందిపప్పు - 250 గ్రా
నూనె - 25 గ్రా
పచ్చిమిర్చి - 4
ఎండుమిర్చి - 1
ఇంగువ - కొంచెం
ఉప్పు - సరిపడినంత
చింతపండు - కొంచెం
కారం - అర టీ స్పూన్
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర - కొంచెం
కరివేపాకు - 2 రెబ్బలు
తయారు చేసే విధానం:
కందిపప్పు బాగా కడిగి ఉడక బెట్టాలి తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కోవాలి. చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి. తరిగిన తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉడుకుతున్న పప్పులో చింతపండు రసం వెయ్యాలి. తోటకూర ఉడికిందనుకున్నాక ఉప్పు, కారం కలిపి, పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయించి తాలింపు (తిరగమాత) పెట్టుకోవాలిి.