టమోటా చారు:
కావలసిన వస్తువులు:
టమోటాలు - 6
నీళ్ళు - 3 గ్లాసులు
చింతపండు - నిమ్మకాయంత
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
టమోటోల్ని శుభ్రంగా కడిగి, 3 గ్లాసుల నీళ్ళలో పడేసి ఉప్పు, చింతపండు కుడా వేసి మొత్తం బాగా పిసికి కొంచెం పసుపు చల్లి స్టౌకెక్కించి కాచుకోవాలి. అవికొంచెం మరిగిన తరువాత దింపి కొత్తిమీర చల్లి తిరగమోత పెట్టుకోవాలి. వేడి వేడి టమోటా రసం రెడీి.