బెండకాయ గుజ్జు కూర:
కావలసినవి:
బెండకాయ ముక్కలు రెండు కప్పులు (అంగుళం చొప్పున కోసుకోవాలి),
శెనగపిండి అరకప్పు పసుపు పావు టీ స్పూను,
దనియాల పొడి ఒక టీ స్పూను,
కారం అర టీ స్పూను,
మామిడి పొడి అర టీ స్పూను,
సోంపు పొడి ఒక టీ స్పూను,
గరం మసాలా అర టీ స్పూను,
నువ్వుల నూనె ఒక టేబుల్ స్పూను,
వాము అర టీ స్పూను,
ఉప్పు తగినంత.
తయారుచేసే పద్ధతి:
బాండలిలో ముందు శెనగపిండి వేసి సన్నసెగమీద కాసేపు వేగించండి. తర్వాత దనియాల పొడి, కారం, సోంపుపొడి, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండలిలో నూనెవేసి ముందు వాము, ఆ తర్వాత బెండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, మామిడి పొడివేసి మూతపెట్టి సన్నసెగమీద వేగనివ్వండి. ముక్క పూర్తిగా మెత్తబడ్డాక శెనగపిండి మిశ్రమం వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు పొయ్యిమీద ఉంచి దించండి.