బెండకాయ వేపుడు:
కావలసిన వస్తువులు:
బెండకాయలు/ - పావు కిలో
నూనె - వేయించడానికి సరిపడినంత
కారం - సరిపడినంత
ఉప్పు - సరిపడినంత
తయారు చేసే విధానం:
బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ముక్కలకు సరిపడినంత కారం, ఉప్పు, అరస్పూన్ నూనెలో వేయించి కలుపుకోవాలి.