Type Here to Get Search Results !

దొండకాయ గుత్తికూర - Dondakaya Gutti kura

 దొండకాయ గుత్తికూర:

కావలసిన పదార్థాలు:

దొండకాయలు - 20,

జీలకర్ర - 1 టీ స్పూను,

శనగపప్పు - 5 టీ స్పూన్లు,

ఎండుమిర్చి -4,

వెల్లుల్లి - 5 రేకలు,

ఉప్పు - రుచికి తగినంత,

నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.


తాలింపు కోసం:

ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, నూనె సరిపడా.


తయారుచేసే విధానం:

జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి. దొండకాయలకు (మూడొంతులు) నిలువుగా కత్తితో ‘+ ’ ఆకారంలో గాటు పెట్టి ఈ మిశ్రమం కూరి అరగంట పక్కనుంచాలి. కడాయిలో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో కడాయిలో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి.



Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom